jayalalitha: జయ మరణం కేసు విచారణ వేగవంతం.. శశికళకు, అపోలో ఆసుపత్రికి సమన్లు
- శశికళ, అపోలో ఆసుపత్రి వివరణ కోరిన కోర్టు
- శశికి 15 రోజులు, అపోలోకు 10 రోజుల గడువు
- విచారణను వేగవంతం చేసిన కోర్టు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత మృతికి సంబంధించిన కేసు విచారణ వేగవంతమైంది. బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళకు... జయలలితకు చికిత్స అందించిన అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి కోర్టు సమన్లు జారీ చేసింది. నిర్ణీత గడువులోగా సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది.
ఈ క్రమంలో శశికళకు 15 రోజులు, అపోలో ఆసుపత్రికి 10 రోజుల గడువు విధించింది. జయలలిత మరణంపై పలు అనుమానాలు రేకెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు, గతంలో చికిత్స పొందుతున్నప్పుడు ఆసుపత్రిలో ఫ్రూట్ జ్యూస్ తాగుతున్న జయలలిత వీడియోను దినకరన్ వర్గీయులు విడుదల చేసిన సంగతి కూడా తెలిసిందే.