mobile data: మొబైల్ డేటా వినియోగంలో అమెరికా, చైనాలను దాటేసిన భారత్!
- వివరించిన నీతి ఆయోగ్ సీఈవో
- ప్రపంచవ్యాప్తంగా డేటా వినియోగిస్తోన్న దేశాల్లో భారత్ నెం.1
- నెలకు 150కోట్ల గిగాబైట్ల డేటా వినియోగం
- జియో తెచ్చిన పోటీయే కారణం
మొబైల్ ఇంటర్నెట్ డేటా వినియోగంలో అమెరికా, చైనాలను దాటేసి మనదేశం దూసుకుపోతోంది. ఇందుకు ప్రధాన కారణం రిలయన్స్ జియోనే అని చెప్పుకోవాలి. ఉచిత మంత్రంతో మార్కెట్లోకి దూసుకువచ్చి జియో ఇచ్చిన పోటీతో ఇతర టెలికాం కంపెనీలు కూడా తక్కువ ధరకే డేటాను ఇస్తున్నాయి. నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ ఈ రోజు ట్వీట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా మొబైల్ డేటా వినియోగిస్తోన్న దేశాల్లో మన దేశం అగ్రస్థానంలో నిలిచిందని, భారతీయులు నెలకు 150 కోట్ల గిగాబైట్ల డేటాను వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. భారత్‌లో అధిక శాతం వినియోగదారులు సోషల్ మీడియా కోసమే డేటాను ఉపయోగిస్తున్నారు.