akhil: 'హలో' సినిమాలో అఖిల్ అదరగొట్టేశాడట!

  • ఈ రోజునే విడుదలైన 'హలో'
  • శీను పాత్రలో కనిపించిన అఖిల్ 
  • ఎమోషన్స్ పండించడంలోను మంచి మార్కులు  

అఖిల్ తాజా చిత్రంగా 'హలో' ఈ రోజున భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్ నటన పరంగా అదరగొట్టేశాడని అంటున్నారు. ఈ సినిమాలో శీను పాత్రలో అఖిల్ కనిపిస్తాడనీ .. పాత్రలో ఆయన పూర్తిగా ఒదిగిపోయాడని చెబుతున్నారు.

 తన చిన్ననాటి స్నేహితురాలిని కలుసుకోవడానికి తాపత్రయపడే యువకుడిగా అఖిల్ అద్భుతంగా నటించాడని అంటున్నారు. ఫైట్స్ .. డాన్స్ విషయంలోనే కాకుండా, ఎమోషన్స్ ను పండించడంలోను అఖిల్ శభాష్ అనిపించుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి ఎంతవరకూ చేయాలో అంతవరకూ అఖిల్ చేసేశాడంటూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి మరి.     

akhil
kalyani priyadarshini
  • Loading...

More Telugu News