nani: నా సినిమాకు నాకే టికెట్లు దొరకడం లేదు: నాని

  • మేనేజర్ కి టికెట్ల కోసం ఫోన్ చేశాను 
  • ఇప్పుడు కష్టం సార్ అనేశాడు 
  • వసూళ్లు చూసి షాక్ అవుతున్నాను  

నాని ఈ ఏడాది మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. మొదటి రెండు సినిమాలు భారీ విజయాలను తెచ్చిపెట్టాయి. దాంతో మూడవ సినిమాగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి'తో నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో నటన పరంగా నాని మంచి మార్కులు కొట్టేశాడనే టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాను గురించి నాని మాట్లాడుతూ .. " ఈ సినిమాలో విలన్ గా చేసిన నటుడు నన్ను ఓ మూడు టికెట్లు అడిగాడు. దాంతో నేను మా మేనేజర్ కి ఫోన్ చేశాను .. ఎంత సేపటికీ ఆయన ఫోన్ తీయలేదు. ఆ తరువాత రిసీవ్ చేసుకుని .. నేను టికెట్లు అడగ్గానే .. "ఇప్పుడు అడగొద్దు సార్" అనేశాడు.

ఈ సినిమాకి ఈ స్థాయిలో వస్తోన్న రెస్పాన్స్ చూసి నాకే ఆశ్చర్యం వేస్తోంది. నా సినిమాకి ఈ స్థాయి వసూళ్లు వస్తున్నాయా? అని నేను షాక్ అవుతున్నాను. ఎక్కడ చూసినా 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' సందడే కనిపిస్తోంది" అంటూ తన సినిమా గురించి చెప్పుకున్నాడు.   

  • Loading...

More Telugu News