Maharashtra: రాహుల్ వచ్చిన వేళా విశేషం... ఆదర్శ్ స్కామ్ లో మాజీ సీఎం అశోక్ చవాన్ కు ఊరట!

  • ఒక్కొక్కటిగా మాయమౌతున్న మరకలు
  • నిన్న 2జీ కేసులో తీర్పు
  • నేడు ఆదర్శ్ స్కామ్ నుంచి బయటపడ్డ చవాన్!

రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత, కాంగ్రెస్ పై ఉన్న మరకలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి గట్టిపోటీని ఇచ్చి, గతంతో పోలిస్తే, మరిన్ని సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్, ఆపై నిన్న 2జీ స్కామ్ నుంచి విముక్తమైంది. 2జీ కేసులో నిందితులంతా నిర్దోషులేనని పటియాలా హౌస్ కోర్టు ప్రకటించడాన్ని ఆ పార్టీ నేతలు చిదంబరం, మన్మోహన్ సింగ్ వంటివారు స్వాగతించారు కూడా.  

ఇక ఇవాళ, మహారాష్ట్రలో జరిగిన ఆదర్శ్ స్కామ్ లో మాజీ సీఎం అశోక్ చవాన్ ను విచారించరాదని చెబుతూ బాంబే హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో అప్పుడు సీఎంగా ఉన్న చవాన్ ను ప్రాసిక్యూట్ చేయాలని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఆదేశించగా, వాటిని హైకోర్టు తోసిపుచ్చింది.

2జీ స్పెక్ట్రమ్ కేసు నుంచి విముక్తి చెందిన మరుసటి రోజునే ఆదర్శ్ కుంభకోణం నుంచి చవాన్ ఊరట పొందడం గమనార్హం. గత సంవత్సరం ఏప్రిల్ లో చవాన్ పై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు విద్యాసాగర్ రావు అనుమతించిన సంగతి తెలిసిందే. అంతకుముందు గవర్నర్ గా పని చేసిన కే శంకర్ నారాయణన్, 2013లో చవాన్ ను విచారించేందుకు అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించారు.

  • Loading...

More Telugu News