palestine: ఐక్యరాజ్యసమితిలో అమెరికాకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఇండియా
- జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించడంపై ఓటింగ్
- అమెరికాకు మద్దతు పలకని ఇండియా
- పాలస్తీనా విషయంలో పాత విధానాన్నే కొనసాగించిన భారత్
జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి వ్యతిరేకించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానానికి మద్దతుగా 128 దేశాలు ఓటు వేశాయి. ఇందులో భారత్ కూడా ఉంది. 9 దేశాలు మాత్రమే అమెరికాకు మద్దతు తెలిపాయి. 35 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. పాలస్తీనా విషయంలో గత కొన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానాన్నే భారత్ కొనసాగించిందని భారత దౌత్యవేత్త వెల్లడించారు.
అమెరికాకు అత్యంత సన్నిహితంగా ఉండే దేశాలు సైతం ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయని చెప్పారు. బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్ లాంటి అమెరికా మిత్ర దేశాలు కూడా భద్రతామండలిలో యూఎస్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. అనంతరం ఈ విషయంపై ట్రంప్ మాట్లాడుతూ, తమను వ్యతిరేకించిన వారికి ఇకపై సాయం చేయబోమని... దీనివల్ల కోట్లాది డాలర్లు తమకు మిగిలిపోతాయని చెప్పారు.