Chennampalli Fort: చెన్నంపల్లి కోట తవ్వకాలలో బయటపడిన ఏనుగు దంతాలు!

  • 9 రోజులుగా గుప్త నిధి కోసం తవ్వకాలు
  • ఇప్పటివరకూ బయటపడ్డ ఎముకలు, ఇనుప ముక్కలు
  • మొత్తం తవ్వకాలపై సీసీ కెమెరాలతో నిఘా

కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో గత 9 రోజులుగా గుప్త నిధి కోసం పురావస్తు, మైనింగ్, రెవెన్యూ అధికారులు తవ్వకాలు జరుపుతున్న నేపథ్యంలో, తాజాగా, ఏనుగు దంతాలు బయటపడ్డాయి. దీంతో అధికారులు మరింత ఉత్సాహంగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఇప్పటివరకూ ఎముకలు, ఇనుపముక్కలు, పాతకాలం ఇటుకలు తదితరాలు బయటపడగా, ఇప్పుడిప్పుడే విలువైన వస్తువులు కంట పడుతున్నాయి. తవ్వకాల తతంగంపై సీసీ కెమెరాలతో నిఘా పెట్టిన అధికారులు, దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు.

తవ్వకాలు మరిన్ని రోజులు సాగుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ కోటలో నిధి ఉందని నమ్ముతున్న ఈ ప్రాంత వాసులు, ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కాగా, ఇక్కడ తవ్వకాల తరువాత నిధి లభిస్తుందన్న ఆశలు లేవని, ఆప్పటి రాజుల గురించిన సమాచారం, ఆ కాలం నాణాలు, పాత్రలు వంటివి వెలుగులోకి వస్తాయని భావిస్తున్నామని పురావస్తు శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రజల కోరిక మేరకే తాము తవ్వకాలు సాగిస్తున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News