charan: ముస్తాబవుతోన్న 'రంగస్థలం' టీజర్ .. సంక్రాంతికి రిలీజ్

  • ముగింపు దశలో 'రంగస్థలం'
  • టీజర్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ 
  • అంచనాలు పెంచేలా వుండనున్న టీజర్  

చరణ్ కథానాయకుడిగా 'రంగస్థలం' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టులుక్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చేసింది. దాంతో అభిమానులంతా టీజర్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ ను సంక్రాంతికి విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా సమాచారం.

 మొదట్లో ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు .. కానీ కుదరలేదు. దాంతో సంక్రాంతికి టీజర్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. సుకుమార్ మార్క్ కనిపించేలా ఈ టీజర్ ఉంటుందని అంటున్నారు. టీజర్ తోనే మరింతగా ఆసక్తిని .. అంచనాలను పెంచే విధంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు .. ఆది పినిశెట్టి .. అనసూయ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.   

  • Loading...

More Telugu News