pavan: పవన్ పాట పాడుతున్న ఫొటోలు ఇవిగో!

  • 'అజ్ఞాతవాసి' కోసం పాట పాడిన పవన్ 
  • అందుకు సంబంధించిన ఫోటోల రిలీజ్ 
  • పవన్ ఫ్యాన్స్ లో పెరుగుతోన్న ఆసక్తి

యూత్ లో పవన్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన డైలాగ్స్ కి .. ఫైట్స్ కి .. డాన్స్ కి పాటలకి విజిల్స్ వర్షం కురుస్తుంటుంది. ఇక ఆయన తన పాటను తానే పాడుకోవడం వాళ్లను మరింతగా హుషారెత్తిస్తుంది. 'కాటమరాయుడు' సినిమాలో పవన్ పాడిన పాటకు అభిమానులు ఎంతగా ఊగిపోయారో తెలిసిందే. మరోసారి ఆడియన్స్ ను అలా ఉత్సాహపరచడం కోసం అన్నట్టుగా, 'అజ్ఞాతవాసి' కోసం పవన్ తో త్రివిక్రమ్ ఒక పాటను పాడించాడు. ఈ పాటను నిన్న రికార్డు చేశారు. పవన్ ఆ పాట పాడుతున్నప్పటి ఫోటోలు బయటికి రావడంతో వాటిని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. మైక్ ముందు పవన్ ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటేనే .. ఈ పాట మాంచి జోరుగా కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ పాటను రాసిన రచయిత భాస్కరభట్ల కూడా ఈ ఫోటోలలో వున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ పాట .. థియేటర్స్ లో ఏ స్థాయిలో సందడి చేస్తుందో, పవన్ ఎన్ని వన్స్ మోర్ లను మూటగట్టుకుంటాడో చూడాలి మరి.   

pavan
keerthi suresh
anu emmanyuel
  • Loading...

More Telugu News