bhavana: నటి భావన పెళ్లి తేదీని ఖరారు చేసేశారు!

  • నటిగా భావనకి మంచి గుర్తింపు
  • నిర్మాత నవీన్ తో నిశ్చితార్థం 
  • వచ్చేనెల 22న వివాహం    

తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో కథానాయికగా భావనకి మంచి గుర్తింపు వుంది. ఈ మధ్య కాలంలో తెలుగులో ఆమెకి అవకాశాలు తగ్గినా, మిగతా భాషల్లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే వచ్చింది. తాను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న తరువాతనే ఆమె సినిమాల సంఖ్యను తగ్గిస్తూ వచ్చింది. కేరళలోని త్రిసూర్ లో మార్చి 9వ తేదీన నిర్మాత నవీన్ తో ఆమె నిశ్చితార్థం జరిగింది.

 జనవరి 22వ తేదీన వీరి వివాహం కేరళ - త్రిసూర్ లోని 'లలు కన్వెన్షన్ సెంటర్' లో జరగనుంది. ఆ రోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు వీరి వివాహం జరుగుతుంది. భావన .. నవీన్ ఇద్దరూ చిత్రపరిశ్రమకి సంబంధించినవారే అయినా, వివాహ వేడుకకి ఎవరినీ పిలవడం లేదట. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలే అందుకు కారణమని అంటున్నారు. సినీ పరిశ్రమకి దూరంగా బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్టు చెబుతున్నారు.

bhavana
naveen
  • Loading...

More Telugu News