Australia: ఆస్ట్రేలియాలో పాద‌చారుల‌పైకి దూసుకెళ్లిన కారు.. ఉగ్ర చ‌ర్య‌?

  • మెల్‌బోర్న్‌ ఫ్లిండర్స్ అండ్ ఎలిజబెత్ వీధిలో ఘ‌ట‌న‌
  • చిన్నారులు స‌హా 15 మందికి గాయాలు
  • భ‌యాందోళ‌న‌ల‌తో ప‌రుగులు తీసిన జ‌నం
  • ఉద్దేశ‌పూర్వ‌కంగానే కారును వేగంగా నడిపిన నిందితులు

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ ఫ్లిండర్స్ అండ్ ఎలిజబెత్ వీధిలో రహదారిపైకి ఓ కారు అతి వేగంగా వ‌చ్చి జనంపైకి దూసుకెళ్లింది. దీంతో 15 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ప్ర‌స్తుతం వారికి ఆసుప‌త్రుల్లో చికిత్స అందుతోంది. గాయ‌ప‌డ్డ వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌తో ఆ ప్రాంతంలో మెట్రో ప్రయాణాలను తాత్కాలికంగా ర‌ద్దు చేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. కారు త‌మ‌పైకి దూసుకువ‌స్తుండ‌డంతో జనం అంతా ప్రాణ భయంతో పరుగులు తీశారు.

తెలుపు రంగు సుజుకీ ఎస్‌యూవీలో ఇద్దరు వ్యక్తులు ముందు సీటులో కూర్చున్నార‌ని, ర్యాష్‌గా డ్రైవింగ్ చేస్తూ దూసుకొచ్చార‌ని ప్రత్యక్ష సాక్షులు మీడియాకు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌తో ఆ ప్రాంత‌వాసులంతా తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఈ ఏడాది మొద‌ట్లో మెల్‌బోర్న్‌లోని రద్దీగా ఉండే ఓ షాపింగ్‌ మాల్‌ వద్ద కారు పాదచారులపైకి దూసుకెళ్లడంతో ఆరుగురు మృతి చెందారు. అదే మెల్‌బోర్న్‌లో మ‌ళ్లీ ఇటువంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. నిందితుల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. నిందితులు ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనకు పాల్ప‌డి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఉగ్ర చర్యా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. 

  • Loading...

More Telugu News