samantha: నిన్న వేదిక‌పై తాను క‌న్నీరు పెట్టుకోలేదని స్పష్టం చేసిన స‌మంత‌!

  • నిన్న సాయంత్రం హైద‌రాబాద్‌లో  'హ‌లో' ప్రీ రిలీజ్ వేడుక
  • చైతూని పొగిడిన నాగ్‌
  • అదే స‌మ‌యంలో స‌మంత క‌న్నీరు
  • 'కన్నీరు కాదు క‌ళ్ల‌కు ఇన్ఫెక్ష‌న్' అని చెప్పిన స‌మంత‌

విక్ర‌మ్ కుమార్ ద‌ర్శక‌త్వంలో అక్కినేని అఖిల్ నటించిన 'హ‌లో' ప్రీ రిలీజ్ వేడుక నిన్న సాయంత్రం హైద‌రాబాద్‌లోని ఎన్ క‌న్వెన్ష‌ న్ హాల్ లో జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప్రోగ్రాంకి సినీన‌టులు చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ తేజ్, నాగ‌చైత‌న్య‌, స‌మంత కూడా హాజ‌ర‌య్యారు. కాగా, వేదిక‌పై నాగార్జున మాట్లాడుతూ నాగ‌చైత‌న్య‌కు ఉన్న మంచి మనసు త‌న‌కే కాదని ఎవ్వరికీ లేదని అన్నారు. అలా చైతూని నాగ్ పొగుడుతున్న‌ప్పుడు స‌మంత కంట నీళ్లు తిరిగాయి.

ఈ విష‌యం గురించి ట్విట్ట‌ర్‌లో స‌మంత అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు. అయితే, తాను క‌న్నీరు పెట్టుకోలేద‌ని స‌మంత ట్విట్ట‌ర్‌లో తెలిపింది. ఆ సమయంలో తాను ఏడవలేదని, త‌న‌ కళ్లకు ఇన్‌ఫెక్షన్‌ సోకిందని, అందుకే అంద‌రికీ అలా అనిపించింద‌ని స‌మంత వివ‌రించింది.   

samantha
Nagarjuna
hello
  • Error fetching data: Network response was not ok

More Telugu News