tirumala: సిఫార్సులతో వచ్చే వెంకన్న భక్తులకు షాక్.. ప్రసాదం ధరలు పెంచేసిన టీటీడీ!

  • భారీగా పెరిగిన స్వామివారి ప్రసాదం ధరలు
  • రూ. 25 లడ్డు రూ. 50కు పెంపు
  • పెరిగిన ధరలు నేటి నుంచే అమలు

కలియుగదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భారీ షాక్ ఇచ్చింది. స్వామివారి ప్రసాదం ధరలను ఒక్కసారిగా అమాంతం పెంచేసింది. రూ. 25గా ఉన్న లడ్డూ ధరను ఏకంగా రూ. 50కి పెంచేసింది. అలాగే రూ. 100గా ఉన్న కళ్యాణోత్సవం లడ్డూ ధరను రూ. 200కు పెంచింది. అదనంగా కేటాయించే లడ్డూలపై ఏకంగా 100 శాతం ధరను పెంచేసింది. ఇదే రీతిలో రూ. 25గా ఉన్న వడ ధరను రూ. 100 చేసింది. సిఫార్సుపై ఇచ్చే ప్రసాదాలకు మాత్రమే ఈ ధరలను వర్తింపజేశారు. దివ్య దర్శనం, సర్వదర్శనం భక్తులకు ఇచ్చే ప్రసాదాల ధరలు మాత్రం యథావిధిగా కొనసాగనున్నాయి. పెరిగిన ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. 

tirumala
tirumala laddu
TTD
  • Loading...

More Telugu News