commercial ads: ప్రజలను మభ్యపెట్టే సెలబ్రిటీల వాణిజ్య ప్రకటనలకు చెక్.. కీలక బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం!

  • ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలపై నిషేధం
  • వినియోగదారుల సంరక్షణ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం
  • కేంద్ర నిర్ణయంతో సెలబ్రిటీలకు షాక్

జనాల్లో భారీ ఎత్తున క్రేజ్ ఉన్న సెలబ్రిటీలు రెండు చేతులా సంపాదిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలు, ఆటల ద్వారా వారికొచ్చే ఆదాయం కంటే యాడ్స్ ద్వారా వారు మరింత ఎక్కువగా సంపాదిస్తున్నారు. వీరితో ఎండార్స్ చేసుకోవడానికి కోట్లాది రూపాయలను ఆఫర్ చేస్తున్నాయి కంపెనీలు.

 ఈ నేపథ్యంలో, వీరి ఆదాయానికి భారీగా గండి కొట్టే కీలక బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రజలను మభ్యపెట్టే తప్పుడు ప్రకటనల్లో సెలబ్రిటీలు నటించడంపై కేంద్రం నిషేధం విధించబోతోంది. ఈ మేరకు నూతన వినియోగదారుల సంరక్షణ బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర వినియోగదారుల సంరక్షణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News