Vijay Sai: నత్తనడకన నటుడు విజయసాయి ఆత్మహత్య కేసు.. పురోగతి లేదన్న పోలీసులు

  • పోలీసులకు ఇంకా అందని ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక
  • తప్పించుకు తిరుగుతున్న విజయసాయి భార్య వనిత
  • కేసు నుంచి బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు

నటుడు విజయసాయి ఆత్మహత్య కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదని పోలీసులే స్వయంగా వెల్లడించారు. ఆత్మహత్యకు ముందు విజయసాయి తీసుకున్న సెల్ఫీ వీడియోకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్టు ఇప్పటి వరకు రాలేదని, అది వచ్చాక కానీ ఏమీ చేయలేమని పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే దర్యాప్తు కొనసాగుతోందని, కేసును అన్ని కోణాల్లోంచి దర్యాప్తు చేస్తున్నట్టు హైదరాబాదు, బంజారాహిల్స్ ఏసీపీ తెలిపారు.

మరోవైపు పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న విజయసాయి భార్య వనితను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న ఆమె అందుకు క్షమాపణ కూడా చెప్పింది. త్వరలోనే పోలీసుల ముందుకు వస్తానని ఇటీవల మీడియాకు సందేశం పంపింది. అయితే ఇప్పటి వరకు ఆమె అజ్ఞాతంలోనే ఉంది. కేసు నుంచి బయటపడేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్న ఆమె.. విజయసాయి మరో మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఇటీవల మీడియాకు విడుదల చేసింది. తన నిజాయతీని నిరూపించుకునేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోకూడదని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Vijay Sai
Vanitha
Actor
Suicide
  • Loading...

More Telugu News