Virat Kohli: ప్రధాని మోదీని రిసెప్షన్‌కు ఆహ్వానించిన కోహ్లీ-అనుష్క

  • నేడు ఢిల్లీలో కోహ్లీ వివాహ విందు
  • ప్రధానిని కలిసి ఆహ్వానించిన ‘విరుష్క’
  • 26న ముంబైలో క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖుల కోసం రిసెప్షన్

కొత్త జంట విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు బుధవారం ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు ఢిల్లీలో ఇవ్వనున్న వివాహ విందుకు ఆయనను ఆహ్వానించారు. ఈ సందర్భంగా మోదీ విరాట్ దంపతులను అభినందించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది.

టీమిండియా సారథి కోహ్లీ-బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మలు ఈనెల 11న ఇటలీలోని టస్కనీలో అతికొద్ది మంది అతిథుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. హనీమూన్ అనంతరం భారత్‌కు చేరుకున్న కొత్త దంపతులు మోదీని కలిసి రిసెప్షన్‌కు ఆహ్వానించారు. నేడు ఢిల్లీలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు కోహ్లీ దంపతులు విందు ఇవ్వనుండగా, ఈనెల 26న ముంబైలో బాలీవుడ్ ప్రముఖులకు, క్రికెటర్లకు విందు ఏర్పాటు చేశారు.

Virat Kohli
Anushka Sharma
Narendra Modi
  • Loading...

More Telugu News