Vijayawada: మృత‌దేహాన్ని ఇంట్లోకి తీసుకు రావ‌ద్ద‌ని.. ఇంటికి తాళం వేసేసిన య‌జ‌మాని!

  • విజయవాడలోని విద్యాధరపురంలో దారుణ ఘ‌ట‌న
  • మృత‌దేహాన్ని ఇంట్లోకి తీసుకువ‌స్తే త‌మ కుటుంబానికి కీడు అని వాద‌న‌
  • పది రోజుల తర్వాత మృతురాలి పిల్లలు ఇంటిని ఖాళీ చేయాల‌ని ఆర్డ‌ర్‌

ఆధునిక యుగంలోనూ మనుషుల్ని మూఢ న‌మ్మ‌కాలు పట్టిపీడిస్తున్నాయి. మ‌నిషిలోని మాన‌వ‌త్వాన్ని చంపేస్తూ ప‌శువులా మార్చేస్తున్నాయి. అదే కోవలో విజయవాడలోని విద్యాధరపురంలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌మ ఇంట్లో అద్దెకు నివసిస్తోన్న నాగమణి అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె మృత‌దేహాన్ని ఇంట్లోకి తీసుకురానివ్వలేదు ఆ ఇంటి య‌జ‌మాని. ఇంటికి తాళం వేసి రోడ్డుపైనే మృత‌దేహాన్ని ఉంచేలా చేశాడు. అంతేకాదు, కర్మకాండలు చేసేంత వరకు మృతురాలి కుటుంబ సభ్యులను ఇంట్లోకి రానివ్వబోమని అన్నాడు.

వారు ఇంట్లోకి వస్తే తమ కుటుంబానికి కీడు జరుగుతుందని అన్నాడు. పది రోజుల తర్వాత ఆమె పిల్లలు ఇంటిని ఖాళీ చేయాల‌ని తేల్చి చెప్పాడు. చివ‌ర‌కు పోలీసుల జోక్యంతో ఆ య‌జ‌మాని ఇంటి తాళం ఇచ్చాడు. కానీ, కర్మకాండల ప్ర‌క్రియ అంతా ఇంటికి దూరంగానే జ‌ర‌గాల‌ని అన్నాడు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News