krishnamraju: చిరంజీవి నాకు మంచి మిత్రుడు .. అలా ఆయనకి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చేశాను: కృష్ణంరాజు
- లండన్ లో ఓ కాస్టిలీ కెమెరా కొన్నాను
- చిరంజీవి బర్త్ డేకి ఆ కెమెరా తీసుకెళ్లాను
- ఆయన నాకు మంచి ఫ్రెండ్
- ఆ కెమెరా నచ్చిందన్నాడు .. ఇచ్చేశాను
కృష్ణంరాజు .. ఐ డ్రీమ్స్ తో మాట్లాడుతూ .. సినిమాల్లోకి రావడానికి ముందు నుంచి ఫోటో గ్రఫీ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. వివిధ రకాల మోడల్స్ కి చెందిన కెమెరాలు తన దగ్గర ఉండేవని అన్నారు. "ఇప్పటికీ కూడా మీకు ఆ ప్యాషన్ ఉందా" అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. అప్పుడాయన స్పందిస్తూ .. "సినిమాల్లోకి వచ్చాక చాలా రోజులు ఉండేది. ఆ తరువాత కెమెరాల్లో కూడా చాలా రకాలు వచ్చేశాయి. డిజిటల్ కెమెరాలు కూడా కొంతకాలం వాడాను" అన్నారు.
"చాలామంచి కెమెరా ఒకటి .. లండన్ లో కొన్నాను దాన్ని.. చాలా కాస్టిలీ కూడా. బ్యాక్ గ్రౌండ్ లో విపరీతమైన ఎండ వున్నా, అదే బ్యాలెన్స్ చేసుకుని సెట్ చేసుకుంటుంది. చిరంజీవి బర్త్ డే కి ఆ కెమెరాతో పాటు మా మేనల్లుడిని తీసుకుని వెళ్లాను. మా మేనల్లుడు ఆ కెమెరాతో ఫోటోలు తీస్తున్నాడు. చిరంజీవి ఆ కెమెరాను చూసి .. "అన్నయ్య .. ఎక్కడ కొన్నావు ఈ కెమెరాను .. నేను లండన్ లో చూశాను .. చాలా కాస్టిలీ .. తీసుకుందామనుకుని .. ఎందుకులే అని వదిలేశాను" అన్నాడు. అప్పుడు మా మేనల్లుడి చేతిలో నుంచి ఆ కెమెరా తీసుకుని చిరంజీవి మెడలో వేసేసి.. ఇది నీ బర్త్ డే గిఫ్ట్ అని ఇచ్చేశాను. చిరంజీవి నాకు మంచి స్నేహితుడు .. ఎవరికీ అపకారం చేసే తత్వం కాదాయనది" అంటూ చెప్పుకొచ్చారు.