google assistant: గూగుల్ అసిస్టెంట్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనుసంధానం

  • 'ఓకే గూగుల్‌.. టాక్ టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌' అంటే చాలు
  • వాయిస్ ఆదేశం ద్వారా బ్యాంకింగ్ సేవ‌లు
  • ప్ర‌తి ఒక్కరికి చేరువ చేసే ఉద్దేశం

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ స‌హాయంతో బ్యాంకింగ్ సేవ‌ల‌ను వినియోగ‌దారుల‌కు చేరువ చేసే ఉద్దేశంతో 'ఈవా' అనే చాట్‌బాట్ అసిస్టెంట్‌ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అందుబాటులోకి తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ చాట్‌బాట్ సేవ‌ల‌ను మ‌రింత విస్తృతం చేసేందుకు గూగుల్‌తో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్‌తో 'ఓకే గూగుల్‌... టాక్ టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌' అని అంటే చాలు, అన్ని ర‌కాల బ్యాంకింగ్ సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయి.

ఆవిష్క‌రించిన నాటి నుంచి 'ఈవా' 50 ల‌క్ష‌ల కంటే ఎక్కువ ప్ర‌శ్న‌లకు, 85 శాతం క‌చ్చిత‌త్వంతో స‌మాధానమిచ్చింద‌ని హెచ్‌డీఎఫ్‌సీ ప్ర‌క‌టించింది. బ్యాంకుకి సంబంధించి అన్ని ర‌కాల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చేలా 'ఈవా'ను రూపొందించామ‌ని, గూగుల్ అసిస్టెంట్‌తో అనుసంధానం అవ‌డం వ‌ల్ల ఇది హెచ్‌డీఎఫ్‌సీ స్మార్ట్‌ఫోన్ వినియోగ‌దారులంద‌రికీ అందుబాటులోకి వ‌చ్చింద‌ని పేర్కొంది.

  • Loading...

More Telugu News