election commission: జయలలిత వీడియో విడుదలపై ఎన్నికల కమిషన్ సీరియస్

  • ఆర్కే నగర్ ఉప ఎన్నికకు ముందు వీడియో విడుదలపై కన్నెర్ర
  • దర్యాప్తు చేయాలంటూ తమిళనాడు ఎన్నికల కమిషన్ కు ఆదేశం
  • వీడియోపై మండిపడ్డ అన్నాడీఎంకే

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు తీసిన వీడియో బయటకు రావడంపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికకు సరిగ్గా ఒక రోజు ముందు వీడియో విడుదల కావడంపై కన్నెర్ర చేసింది.

 ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి నివేదికను అందజేయాలంటూ తమిళనాడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ఆదేశించింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకే ఈ వీడియోను విడుదల చేశారా? అనే కోణంలో సీఈసీ దృష్టి సారించింది. మరోవైపు ఈ వీడియోపై అన్నాడీఎంకే కూడా మండిపడింది.

election commission
jayalalitha video
election commission serious on jaya video
  • Loading...

More Telugu News