jayalalitha: సంచలనం.. హాస్పిటల్ లో జయలలిత వీడియోను బయటపెట్టిన దినకరన్ వర్గం... వీడియోను మీరూ చూడండి

  • హాస్పిటల్ బెడ్ పై జయలలిత
  • ఫ్రూట్ జ్యూస్ తాగుతున్న మాజీ ముఖ్యమంత్రి
  • చికిత్సలో లోపం లేదన్న వెట్రివేల్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటి వీడియోను దినకరన్ వర్గీయులు విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు సెన్సేషన్ గా మారింది. బెడ్ పై ఉన్న ఆమె రెండు జడలు వేసుకున్నట్టు వీడియోలో ఉంది. ఏదో ఫ్రూట్ జ్యూస్ తాగున్నారు. దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు లేదా దేన్నో నిశితంగా గమనిస్తున్నట్టు కనబడుతున్నారు. బహుశా ఆమె టీవీ కూడా చూస్తుండవచ్చు.

దినకరన్ వర్గ ఎమ్మెల్యే వెట్రివేల్ ఈ వీడియోను విడుదల చేశారు. ఇప్పటి వరకు ఆసుపత్రిలో ఉన్న జయ వీడియో ఒక్కటి కూడా బయటకు రాలేదు. ఇదే తొలి వీడియో. వీడియోలో జయ తప్ప మరెవరూ కనిపించలేదు. జయ చికిత్స పొందుతున్న సమయంలో, ఆమెను చూడటానికి ఎవరినీ లోపలకు పంపించలేదు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక ప్రచారం ముగిసిన తర్వాత వ్యూహాత్మకంగా ఈ వీడియోను దినకరన్ వర్గం బయటపెట్టినట్టు అంచనా వేస్తున్నారు.

ఈ సందర్భంగా వెట్రివేల్ మాట్లాడుతూ, జయకు సరైన వైద్యం అందించలేదంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. చికిత్సకు సంబంధించిన అనేక ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని... వాస్తవమేంటో విమర్శలు చేస్తున్నవారికి కూడా తెలుసని మండిపడ్డారు.



jayalalitha
jayalalitha video
  • Loading...

More Telugu News