charan: రాజమౌళి సినిమాతో పాటే కొరటాలతో చరణ్!

  • 'రంగస్థలం'తో రెడీ అవుతోన్న చరణ్ 
  • తదుపరి సినిమా రాజమౌళితో అంటూ ప్రచారం 
  • అదే సమయంలో కొరటాలతోను చరణ్ 
  • మెగా అభిమానుల్లో ఆనందం  

చరణ్ తాజా చిత్రంగా రూపొందిన 'రంగస్థలం' సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత చరణ్ .. రాజమౌళి సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది భారీ మల్టీ స్టారర్ .. ఒక హీరోగా ఎన్టీఆర్ చేయనుండగా .. మరో హీరోగా చరణ్ చేయనున్నాడు.

ఈ ప్రాజెక్టుతో పాటే చరణ్ .. మరో సినిమా కూడా చేయనున్నట్టు సమాచారం. ఆ సినిమాకి దర్శకుడు ఎవరో కాదు .. కొరటాల శివ. ఇప్పటికి ఈ కాంబినేషన్లో రెండు సార్లు సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఈ ప్రాజెక్టు సెట్ అయిందనేది తాజా సమాచారం. ఒకవేళ రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఆలస్యమైనా, కొరటాలతో చరణ్ సినిమా మొదలైపోతుందని అంటున్నారు. ఈ రెండూ క్రేజీ కాంబినేషన్లే కావడం మెగా అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయం.   

  • Loading...

More Telugu News