shamsher sing dullo: ఎంపీకే బురిడీ కొట్టి... వేల రూపాయలు కొల్లగొట్టాడు!

  • రాజ్యసభ సభ్యుడు షంషేర్ సింగ్ కు టోకరా
  • మాటలు నమ్మి ఓటీపీ నెంబర్ చెప్పిన ఎంపీ
  • క్షణాల్లో డబ్బు తస్కరణ

సైబర్ నేరగాళ్లు అమాయకులనే కాదు... ఏకంగా ప్రజాప్రతినిధులను కూడా బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి పలు ఉదంతాలు వెలుగుచూశాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, పంజాబ్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు షంషేర్ సింగ్ దుల్లోకు ఓ వ్యక్తి ఫోన్ చేసి, తాను బ్యాంక్ మేనేజర్ ను అంటూ పరిచయం చేసుకున్నాడు. మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ ను అనుసంధానం చేసేందుకు వీలుగా... మీ ఫోన్ కు వచ్చే ఓటీపీ నంబర్ ను చెప్పాలని కోరాడు.

ఈ మాటలను నమ్మిన సదరు ఎంపీ ఓటీపీ నంబర్ ను ఆగంతుకుడికి చెప్పారు. అంతే, వెంటనే ఫోన్ డిస్ కనెక్ట్ అయింది. ఆ తర్వాత తన ఖాతా నుంచి రూ. 27 వేల డబ్బు ట్రాన్స్ ఫర్ అయినట్టు మెస్సేజ్ వచ్చింది. దీంతో షంషేర్ కంగు తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... ఫోన్ నంబర్, ఐపీ అడ్రస్ సాయంతో సైబర్ నేరగాడి కోసం గాలింపు మొదలుపెట్టారు. 

  • Loading...

More Telugu News