Solar System: రేపు అత్యంత ప్రమాదకరమైన రోజు.. కొత్త పనులు మొదలు పెట్టొద్దు!.. హెచ్చరిస్తున్న పాశ్చాత్య జ్యోతిష్యులు

  • రేపు సూర్యుడు, శని ఒకే రాశిలోకి..
  • 350 ఏళ్ల తర్వాత తొలిసారి
  • పనులు మొదలుపెడితే మటాషేనంటున్న జ్యోతిష్యులు
  • కోడై కూస్తున్న వెబ్‌సైట్లు

‘బీ కేర్ ఫుల్.. రేపు ఈ ఏడాదిలోనే అత్యంత ప్రమాదకరమైన రోజు.. గురువారం ఏ పనీ మొదలుపెట్టవద్దు’.. అంటున్నారు పాశ్చాత్య జ్యోతిష్యులు. డిసెంబరు 21న ఏ పని మొదలుపెట్టినా మటాషేనని, ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అభాసుపాలు కాక తప్పదని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. దాని ప్రభావం వచ్చే ఏడాదీ కొనసాగుతుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

డిసెంబరు 21న పగటి కాలం నిడివి చాలా తక్కువ. ప్రతీ ఏడాది ఇది జరిగేదే అయినా ఈసారి మాత్రం సూర్యుడు, శని ఒకే రాశిలోకి వస్తున్నారని చెబుతున్నారు. ఇలా రావడం 350 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారని, ప్రళయానికి ఇది సంకేతమని చెబుతున్నారు.

1664 తర్వాత ఖగోళంలో ఇలాంటి మార్పు కనిపించడం ఇదే తొలిసారని నీల్ స్పెన్సర్ అనే జ్యోతిష్యుడు తెలిపాడు. సాధారణంగా వ్యక్తుల జాతకంలో శని మకర రాశిలోకి ప్రవేశిస్తే బాగానే ఉంటుందని, కానీ ఖగోళ పరంగా ఇది చాలా ప్రమాదకరమైన విషయమని పేర్కొన్నాడు. కాబట్టి గురువారం చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏ పనీ మొదలుపెట్టద్దని, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నాడు.

పలు ఆస్ట్రాలజీ వెబ్‌సైట్లు కూడా ఇదే విషయాన్ని చెబుతూ హెచ్చరిస్తున్నాయి. 21న పగటి సమయం తక్కువగా ఉండడంతో ఆ రోజు మనుషుల్లో శక్తి సన్నగిల్లుతుందని, కాబట్టి ఆ రోజున ఏ పనిచేయకుండా ఉండడమే ఉత్తమమని చెబుతున్నాయి.

Solar System
Sun
Earth
  • Loading...

More Telugu News