Virat Kohli: కోహ్లీ.. ఇదేనా నీ దేశభక్తి?.. ప్రశ్నించిన బీజేపీ నేత

  • ఈ నేలపై డబ్బులు సంపాదించి విదేశాల్లో కోట్ల ఖర్చుతో పెళ్లా?
  • దేశంపై నీకు ఏమాత్రం గౌరవం లేదన్న సంగతి తెలిసిపోతోంది
  • విరుచుకుపడిన ఎమ్మెల్యే పన్నాలాల్

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు విరుచుకుపడ్డారు. కోహ్లీ- బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలు ఈనెల 11న ఇటలీలో రహస్యంగా వివాహం చేసుకోవడంపై స్పందించిన ఎమ్మెల్యే పన్నాలాల్.. ‘‘కోహ్లీ ఇదేనా నీ దేశభక్తి?’’ అని ప్రశ్నించారు. ఓ కార్యక్రమంలో  పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కోహ్లీకి ఏమాత్రం దేశభక్తి లేదని విమర్శించారు. ఈ నేలపై డబ్బులు సంపాదిస్తూ ఎక్కడో ఇటలీలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పెళ్లి చేసుకోవడం ఏంటని నిలదీశారు. ఆయనకు మనదేశంపై ఏమాత్రం గౌరవం లేదనడానికి ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు.

శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, విక్రమాదిత్యుడు ఈ నేలపైనే పెళ్లి చేసుకున్నారని, కోహ్లీ మాత్రం విదేశాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వివాహం చేసుకున్నాడని విమర్శించారు. కోహ్లీ దేశభక్తికి ఇది నిదర్శనమని వ్యంగ్యంగా అన్నారు. కాగా, ఆయన వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఆయనకు మద్దతు పలికితే మరికొందరు మాత్రం ఎవరు ఎక్కడ పెళ్లి చేసుకోవాలో కూడా బీజేపీనే నిర్ణయిస్తుందా? అని విరుచుకుపడుతున్నారు.

Virat Kohli
Anushka Sharma
BJP
Italy
  • Loading...

More Telugu News