somu veerrahju: సోము వీర్రాజు వ్యాఖ్యలపై ఏపీ మంత్రి సోమిరెడ్డి స్పంద‌న!

  • 2019 ఎన్నికల్లో సీట్లను యాచించే స్థితిలో బీజేపీ ఉండదని సోము వీర్రాజు వ్యాఖ్య‌
  • ఆ మాట‌లు మోదీ, అమిత్ షా, చంద్ర‌బాబు లాంటి వారు మాట్లాడ‌లేదు క‌దా?
  • మోదీ స‌హ‌క‌రిస్తున్నార‌ని చంద్ర‌బాబు నాయుడే స్వ‌యంగా చెప్పారు- సోమిరెడ్డి

మిత్రపక్షం టీడీపీపై ఏపీ బీజేపీ నేత‌ సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి స్పందించారు. తాము ఎన్డీఏలో మిత్ర‌ప‌క్షంగా ఉన్నామని అన్నారు. 'బీజేపీ, టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేయ‌బోవ‌ని మోదీ, అమిత్ షా, చంద్ర‌బాబు, క‌ళా వెంక‌ట్రావు లాంటి వారు మాట్లాడ‌లేదు క‌దా?' అని అన్నారు. మోదీ స‌హ‌క‌రిస్తున్నార‌ని చంద్ర‌బాబు నాయుడే స్వ‌యంగా చెప్పార‌ని అన్నారు.

కాగా, 2019 ఎన్నికల్లో సీట్లను యాచించే స్థితిలో బీజేపీ ఉండదని, అధికారపక్షాన్ని డిసైడ్ చేసే స్థాయిలో ఉంటుందని సోము వీర్రాజు వ్యాఖ్యానించిన నేప‌థ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్ర‌సాద్ కౌంట‌ర్ ఇస్తూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై త్వరలోనే చర్చిస్తామని, ఊరుకోబోమ‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఈ నేప‌థ్యంలో 2019లో బీజేపీతో టీడీపీ క‌లిసి ప‌నిచేస్తుందా? అనే అంశంపై మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సోమిరెడ్డి ఈ విధంగా స‌మాధానం చెప్పారు. 

somu veerrahju
rajendra prasad
somi reddy
  • Loading...

More Telugu News