vodafone: చవక ధరకు 4జీ స్మార్ట్‌ఫోన్... ఆవిష్కరించిన వొడాఫోన్
- చైనా సంస్థతో ఒప్పందం
- రూ. 3,690 చెల్లిస్తే రూ. 2100 క్యాష్‌బ్యాక్
- ఆకట్టుకుంటున్న ఫీచర్లు
రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ ధాటిని తట్టుకోవడానికి ఇతర టెలికాం నెట్‌వర్క్‌లు తక్కువ ధర గల స్మార్ట్ఫోన్లను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టెలికాం సంస్థ వొడాఫోన్ రూ.1590కే ఐటెల్ ఎ20 పేరిట చవకైన 4జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని తయారీ కోసం చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఐటెల్ మొబైల్‌తో ఒప్పందం చేసుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం ముందు వినియోగదారుడు ఈ ఫోన్‌ను రూ. 3,690 డౌన్ పేమెంట్ చెల్లించి కొనుక్కోవాలి. అనంతరం నెలకు రూ.150 ఆపైన విలువ గల ప్లాన్‌ను 36 నెలల పాటు వాడాలి. దీంతో వినియోగదారులకు మొదటి 18 నెలల తరువాత రూ.900, 36 నెలల తరువాత మరో రూ.1200 క్యాష్ బ్యాక్ వస్తుంది. దీంతో మొత్తం రూ.2100 వినియోగదారులకు వెనక్కి వస్తాయి. అలా ఈ ఫోన్ ఖరీదు రూ.1590 అవుతుందన్నమాట.
ఇక ఈ ఫోన్లో ఫీచర్ల విషయానికొస్తే... 4 ఇంచ్ డిస్ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 0.3 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్టీఈ, 1700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.