migration: విదేశాల్లో నివ‌సిస్తున్న వారిలో భార‌తీయులే ఎక్కువ‌ట!

  • 17 మిలియ‌న్ల మంది విదేశాల్లోనే
  • వెల్ల‌డించిన ఐక్య‌రాజ్య‌స‌మితి
  • త‌ర్వాతి స్థానాల్లో మెక్సికో, ర‌ష్యా, చైనా

2017 ఇంట‌ర్నేష‌న‌ల్ మైగ్రేష‌న్ పేరుతో విదేశాల్లో నివ‌సిస్తున్న వ‌ల‌స‌దారుల జాబితాను ఐక్య‌రాజ్య‌స‌మితి విడుద‌ల చేసింది. దీని ప్రకారం, విదేశాల్లో నివ‌సిస్తున్న వారిలో భార‌తీయులే ఎక్కువ‌ని తేలింది. 17 మిలియ‌న్ల మంది భార‌తీయులు విదేశాల్లో నివ‌సిస్తున్నార‌ని నివేదిక తెలిపింది. ఒక్క గల్ఫ్‌ దేశాల్లోనే 5 మిలియన్ల మంది భారతీయులు నివసిస్తున్నట్లు వెల్లడించింది.

ఆ తర్వాతి స్థానాల్లో మెక్సికో, రష్యా, చైనా, బంగ్లాదేశ్‌, సిరియా, పాకిస్థాన్‌, ఉక్రెయిన్‌ దేశాలు ఉన్నాయి. ఒక్కో దేశం నుంచి సుమారు 6 నుంచి 11 మిలియన్ల మంది విదేశాల్లో ఉంటున్నారు. మెక్సికో 13 మిలియన్లు, రష్యా 11 మిలియన్లు, చైనా 10 మిలియన్లు, బంగ్లాదేశ్‌ 7 మిలియన్లు, సిరియా 7మిలియన్లు, పాకిస్థాన్‌, ఉక్రెయిన్‌ నుంచి 6 మిలియన్ల మంది విదేశాల్లోనే ఉంటున్నారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 258 మిలియన్ల మంది విదేశాల్లో జీవనం సాగిస్తున్న‌ట్లు నివేదిక పేర్కొంది. 2000 సంవత్సరంతో పోల్చుకుంటే వీరి సంఖ్య 49శాతం పెరిగింది. అయితే కొన్ని దేశాల్లో ఈ వలసలు జనాభా వృద్ధికి దోహదపడుతుంటే.. మరికొన్ని దేశాల్లో మాత్రం జనాభా తిరోగమనానికి కారణమవుతున్న‌ట్లు యూఎన్ తెలిపింది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News