Narendra Modi: ఆ భయంతోనే అబద్ధపు ప్రచారాలు చేశారు!: మోదీపై ఫరూక్ అబ్దుల్లా విమర్శలు

  • మోదీ వ్యాఖ్యలను ఖండించిన ఫరూక్
  • ఓటమి భయంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు
  • చెప్పా పెట్టకుండా లాహోర్ లో దిగినప్పుడు ఎవరైనా కుట్ర చేశారా?

గుజరాత్ లో అధికారంలోకి వచ్చేందుకు పాకిస్థాన్ తో కలసి కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసిందంటూ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా మండిపడ్డారు. మోదీ వ్యాఖ్యలను కొట్టి పారేశారు. ప్రచార స్టంట్ లో భాగంగానే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. పాక్ తో కలసి కాంగ్రెస్ ఎలాంటి కుట్రలు చేయలేదని చెప్పారు. మోదీ హత్యకు పాక్ లో సుపారీ ఇచ్చారంటూ వచ్చిన వ్యాఖ్యలపై ఫరూక్ అబ్దుల్లాను మీడియా ప్రతినిధులు స్పందన కోరగా ఆయన ఈ విధంగా స్పందించారు.

ఆఫ్ఘనిస్థాన్ నుంచి తిరిగి వస్తూ ఎవరికీ చెప్పకుండా మోదీ లాహోర్ లో ల్యాండ్ అయ్యారని... అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ మనవరాలి పెళ్లికి కూడా హాజరయ్యారని ఫరూక్ అన్నారు. అప్పుడేమైనా పాకిస్థానీలు మోదీని హత్య చేసేందుకు కుట్ర చేశారా? అంటూ ఎదురు ప్రశ్నించారు. గుజరాత్ ఎన్నికల్లో మోదీకి ఓటమి భయం పట్టుకుందని... అందుకే పలు అంశాలను ఆయన తెరపైకి తీసుకొచ్చారని, అబద్ధపు ప్రచారాలు నిర్వహించారని మండిపడ్డారు. 

Narendra Modi
farooq abdullah
  • Loading...

More Telugu News