Manchu Lakshmi: మీ 28 శాతం జీఎస్టీని మీరే మరచిపోతే ఎలా?: అమిత్ షాకు ట్విట్టర్ ద్వారా కౌంటరిచ్చిన మంచు లక్ష్మి

  • 182 సీట్లలో 28 శాతం జీఎస్టీ 51
  • బీజేపీ అడిగిన 150 సీట్ల నుంచి దాన్ని మినహాయించారు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మంచు లక్ష్మి ట్వీట్

గుజరాత్ లో తాము మొత్తం 150 సీట్లను సాధిస్తామని చెప్పి, చివరకు 99 స్థానాలకు బీజేపీ పరిమితమైన నేపథ్యంలో, నటి మంచు లక్ష్మి వినూత్న ట్వీట్ తో కౌంటరిచ్చారు. 'ఫౌండ్ దిస్ ఫన్నీ' అంటూ, 182 సీట్లున్న గుజరాత్ లో అమిత్ షా 150 సీట్లను అడిగారు. గుజరాత్ ప్రజలు మొత్తం సీట్ల నుంచి 28 శాతం జీఎస్టీని తీసేసి 99 సీట్లు ఇచ్చారు. అంటూ 150లో 28 శాతం తీసేస్తే మిగిలేది 99 సీట్లని గుర్తు చేశారు.
182లో 28 శాతం అంటే 51 అవుతుంది. బీజేపీ అడిగిన 150 సీట్లలో 51 సీట్లను తీసేస్తే మిగిలేది 99. అవే బీజేపీకి వచ్చాయన్న అర్థంలో మంచు లక్ష్మి పెట్టిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్.

Manchu Lakshmi
28% GST
Gujarath
Amit Shaw
  • Error fetching data: Network response was not ok

More Telugu News