smart phone: స్మార్ట్ ఫోన్ వాడే మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే ఇబ్బందులే!
- రేడియేషన్ తో గర్భస్రావం జరిగే అవకాశం
- మైక్రో వేవ్ తో కూడా సమస్యలే
- కిడ్నీ సమస్యలతో మధుమేహం వచ్చే ప్రమాదం
స్మార్ట్ ఫోన్ వాడే మహిళలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అమెరికాకు చెందిన కైజర్ పర్మనెంట్ డివిజన్ ఆఫ్ రీసర్చ్ శాస్త్రవేత్తలు తెలిపారు. మైక్రోవేవ్, వైఫై రౌటర్లు, స్మార్ట్ ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ తో గర్భస్రావం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయస్కాంత క్షేత్రాల నుంచి వెలువడే రేడియేషన్ వల్ల ఈ ప్రమాదం పొంచి ఉందని చెప్పారు.
మరోవైపు కేన్సర్ వ్యాధులను నిర్ధారించే సరికొత్త రక్త పరీక్షను జార్జియా స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తెల్ల రక్త కణాల క్యాన్సర్, మెలనోమా అనే ఒక రకమైన చర్మ క్యాన్సర్ ను ఇన్ ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపితో పరీక్షలు చేసిన నిర్ధారించవచ్చని వీరు తెలిపారు. మరోవైపు మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారికి మధుమేహం వచ్చే ముప్పు ఉందని తాజా అధ్యయనంలో తేలింది. ఇప్పటి వరకు మధుమేహం ద్వారా కిడ్నీ పాడవుతుందని మాత్రమే భావిస్తున్నారు. మూత్ర పిండాలు సరిగా పని చేయకపోతే రక్తంలో యూరియా శాతం పెరిగి మధుమేహానికి దారి తీస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.