Chandrababu: చంద్రబాబు చూపిస్తున్న నవ్యాంధ్ర పురోగతి... ఆకర్షిస్తున్న వీడియోను చూడండి!

  • అమరావతిలో శరవేగంగా అభివృద్ధి పనులు
  • డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన వీడియో విడుదల
  • కంపెనీలకు ఇచ్చిన భూమి వివరాలనూ చూపిన చంద్రబాబు

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో అభివృద్ధి ఎలా జరుగుతోందన్న విషయాన్ని వీడియో రూపంలో సీఎం చంద్రబాబునాయుడు తన ఫేస్ బుక్ ఖాతాలో అప్ లోడ్ చేయగా అదిప్పుడు వైరల్ అవుతోంది. కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, సీడ్ యాక్సెస్ రోడ్డు పనుల పురోగతి, జాతీయ రహదారి విస్తరణ పనులు, వెలగపూడిలో నిర్మించిన సెక్రటేరియేట్, దాని చుట్టుపక్కలా జరుగుతున్న పనులు, అక్కడి పచ్చదనం, అసెంబ్లీ లోపలి దృశ్యాలు, నేలపాడులో నిర్మితమైన వీఐటీ వర్శిటీ క్యాంపస్, ఎస్ఆర్ఎం యూనివర్శిటీ, మంగళగిరిలోని ఎయిమ్స్ పనులు సాగుతున్న తీరును చూపించారు.

వీటితో పాటు అధికారులకు ఇళ్ల నిర్మాణం, ఎన్జీవో కార్యాలయాల నిర్మాణం తదితరాలను చూపిస్తూ, ఇప్పటివరకూ ఏ సంస్థకు ఎన్ని ఎకరాల స్థలం ఇచ్చారు, అవి పెట్టిన పెట్టుబడులు ఏంటి, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? తదితర వివరాలను తెలిపారు. ఈ వీడియోలను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించగా అవిప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి. చంద్రబాబు పోస్టు చేసిన వీడియోను మీరూ చూడవచ్చు.

Chandrababu
Amaravati
Velagapudi
Assembly
Development
  • Loading...

More Telugu News