Telangana: కేసీఆర్‌కు అమెరికా శ్వేతసౌధ సలహాదారు ఇవాంకా ట్రంప్ లేఖ

  • ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యాన్ని మర్చిపోలేనన్న ఇవాంకా
  • అనిర్వచనీయమంటూ ప్రశంసలు
  • అవకాశం దొరికితే మరోమారు హైదరాబాద్‌కు వస్తానన్న ట్రంప్ కుమార్తె

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, శ్వేతసౌధ సలహాదారు ఇవాంకా ట్రంప్ లేఖ రాశారు. ఇటీవల నిర్వహించిన ప్రపంచ వాణిజ్యవేత్తల సదస్సుకు హాజరైన ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించిన తీరు అనిర్వచనీయమని పేర్కొన్న ఇవాంకా అవకాశం దొరికితే మరోమారు హైదరాబాద్ వస్తానని లేఖలో పేర్కొన్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో తనకు లభించిన ఆతిథ్యం, కానుకను ఎప్పటికీ మర్చిపోలేనని ఇవాంకా పేర్కొన్నారు.

Telangana
KCR
Ivanka Trump
GES
Letter
  • Loading...

More Telugu News