yogi adityanath: ఇక 2019 ఎన్నిక‌ల‌కు కాదు.. 2024 ఎన్నిక‌ల‌కు ప్రిపేర్ అవ్వండి: కాంగ్రెస్ కు యోగి ఆదిత్య‌నాథ్‌ వ్యంగ్య సూచన

  • మోదీ నాయకత్వం ఎంత బ‌లంగా ఉందో రుజువైంది
  • మోదీ అమలు చేస్తోన్న ఆర్థిక సంస్కరణలను ప్రజలు స్వాగ‌తిస్తున్నారు
  • 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుస్తుంది
  • 2019లో యూపీలో మా పార్టీ 80 లోక్‌స‌భ‌ సీట్లనూ గెలుస్తుంది

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ విజ‌య దుందుభి మోగించిన విష‌యం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో త‌మ పార్టీ సాధించిన విజ‌యంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వం ఎంత బ‌లంగా ఉందో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలే రుజువు చేశాయని వ్యాఖ్యానించారు. మోదీ అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలను ప్రజలు స్వాగ‌తిస్తున్నార‌ని తెలిపారు.

దేశ ఆర్థిక వ్యవస్థను బ‌ల‌ప‌ర్చేదిశ‌గా న‌రేంద్ర‌ మోదీ కృషి చేస్తున్నారని యోగి ఆదిత్య‌నాథ్‌ అన్నారు. మోదీ, అమిత్ షా వంటి వారి బ‌ల‌మైన నాయ‌కత్వంతో పాటు, బీజేపీ కార్యకర్తల శ్రమే త‌మ పార్టీ విజ‌యానికి కార‌ణ‌మ‌ని అన్నారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ గెలుస్తుంద‌ని ఇప్ప‌టికే ఖ‌రార‌యిపోయిన‌ట్లేన‌ని, ఇక కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి మాత్ర‌మే ప్ర‌ణాళిక‌లు వేసుకోవాల‌ని ఎద్దేవా చేశారు. 2019లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో త‌మ పార్టీ 80 లోక్‌స‌భ‌ సీట్నూ గెలుస్తుంద‌ని ఆయన ధీమా వ్య‌క్తం చేశారు.  

yogi adityanath
elections
loksabha
  • Loading...

More Telugu News