somu veerraju: సోము వీర్రాజు.. పగటి కలలు కనడం మానుకో: టీడీపీ నేత రాజేంద్రప్రసాద్

  • ఏపీలో అధికారాన్ని శాసిస్తామన్న వీర్రాజు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన రాజేంద్రప్రసాద్
  • తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు

2019లో ఏపీలో అధికారాన్ని శాసించేది బీజేపీనే అంటూ ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. టీడీపీని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు సరికావని ఆయన అన్నారు. పగటి కలలు కనడం మానుకోవాలంటూ హితవు పలికారు.

పురందేశ్వరి, వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై పార్టీ సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. ప్రపంచ తెలుగు మహా సభలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరుపై రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును సభలకు ఆహ్వానించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎన్టీఆర్ ఫొటోను ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని అన్నారు.

somu veerraju
yvb rajendra prasad
BJP
Telugudesam
  • Loading...

More Telugu News