ys jagan: త్వరలోనే మంచి రోజులు వస్తాయి.. ధైర్యంగా ఉండండి: జగన్ భరోసా

  • 38వ రోజుకు చేరుకున్న జగన్ పాదయాత్ర
  • కష్టాలను చెప్పుకున్న గొర్రెల కాపర్లు
  • అధికారంలోకి రాగానే కష్టాలను తీరుస్తానన్న జగన్

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర 38వ రోజుకు చేరుకుంది. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా జగన్ వద్దకు గొర్రెల కాపర్లు వచ్చారు. 150 గొర్రెలను కొంటే 36 గొర్రెలు చనిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన గొర్రెలకు ఇన్స్యూరెన్స్ అందడం లేదని చెప్పారు. ఆ తర్వాత జగన్ మాట్లాడుతూ త్వరలోనే మంచి రోజులు వస్తాయని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. త్వరలోనే మన ప్రభుత్వం రాబోతోందని అంత వరకు ఓపిక పట్టాలని ధైర్యం చెప్పారు. తాను అధికారంలోకి రాగానే అందరి కష్టాలను తీరుస్తానని చెప్పారు. 

ys jagan
jagan padayatra
  • Loading...

More Telugu News