yogi aditya nath: ముగ్గురు బీజేపీ ఎంపీల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్ సుమిత్రా మహాజన్

  • రాజీనామా చేసిన ఆదిత్యనాథ్, కేశవ్ ప్రసాద్, నానా పటోలే
  • అసంతృప్తితో పటోలే రాజీనామా
  • నేడు ఆమోదించిన స్పీకర్

బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీల రాజీనామాలను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. యోగి ఆదిత్యనాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్య, నానా పటోలేల రాజీనామాలకు ఆమోదముద్ర వేశారు. వీరిలో యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రిగా, కేశవ్ ప్రసాద్ మౌర్య యూపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఇక బీజేపీ నాయకత్వంపై ఉన్న అసంతృప్తితో మహారాష్ట్రకు చెందిన పార్లమెంటు సభ్యుడు నానా పటోలే రాజీనామా చేశారు. గతంలోనే వీరంతా రాజీనామాలు చేసినప్పటికీ, వాటిని ఈరోజు ఆమోదించారు. ఈ నేపథ్యంలో ఈ మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.  

yogi aditya nath
simitra mahajan
  • Loading...

More Telugu News