Gujarath: గుజరాత్ లో మెజారిటీ లభించినా.. ఆరు జిల్లాల్లో నామరూపాల్లేకుండా పోయిన బీజేపీ!
- ఆందోళన కలిగిస్తున్న సౌరాష్ట్ర ఫలితాలు
- ఆరు జిల్లాల్లో ఖాతా తెరవలేని పరిస్థితి
- పోర్ బందర్, ఆనంద్, అమ్రేలీ జిల్లాల్లో కాంగ్రెస్ సంబరాలు
ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో, తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడంలో బీజేపీ విజయం సాధించినా, ఆరు జిల్లాల్లో కనీసం ఒక్క స్థానమైనా గెలవలేని స్థితిలోకి జారిపోవడం ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన పెంచుతోంది. అమ్రేలీ, నర్మద, పోర్ బందర్, ఆనంద్, డాంగ్స్, తాపీ జిల్లాల్లో కనీసం ఒక్క స్థానంలోనైనా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించే పరిస్థితి కనిపించడం లేదు.
ఈ జిల్లాల్లో బీజేపీ తుడిచిపెట్టుకు పోవడంతో కాంగ్రెస్ శ్రేణులు సైతం సంబరాలు చేసుకుంటున్నారు. ఉత్తర గుజరాత్‌లో 32 చోట్ల బీజేపీ, 16 చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా, సౌరాష్ట్రలో బీజేపీ 24, కాంగ్రెస్ 32 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కొంచెం అటూఇటుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే ఫలితాలు వెలువడుతున్నాయి. బీజేపీ 106 స్థానాలను దక్కించుకునేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ గతంతో పోలిస్తే బలపడి 74 స్థానాలకు చేరుకునేలా ఉంది.