KTR: కేటీఆర్ సార్, మీరు మాకు గర్వకారణం: కేటీఆర్ పై టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు

  • కేటీఆర్ పై టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు
  • ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ ఆకాంక్ష
  • ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్

'లీడర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు ఎంపికైన తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సినీ నిర్మాత బండ్ల గణేష్ అభినందనలు తెలిపారు. 'కేటీఆర్ సార్ కంగ్రాచ్యులేషన్స్. తెలంగాణకు మీరు గర్వకారణం' అంటూ ట్వీట్ చేశారు. 'కంగ్రాట్స్ కేటీఆర్ భాయ్. అభివృద్ది కోసం మీరు చేస్తున్న కృషిని గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా స్టార్టప్ క్యాంపెయిన్ అద్భుతం. యువ వ్యాపారవేత్తలకు ఇది ఎంతో తోడ్పాటును అందిస్తుంది. ఈ అవార్డుకు మీరు పూర్తిగా అర్హులు. మీరు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలి' అంటూ హీరో నిఖిల్ ట్వీట్ చేశాడు.

తెలుగువారందరికీ గర్వకారణమని మంచు విష్ణు ట్వీట్ చేయగా... కేటీఆర్ థ్యాంక్స్ చెబుతూ, ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ఓ షూటింగ్ సందర్భంగా మంచు విష్ణు గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విష్ణు ఆరోగ్యం గురించి కేటీఆర్ స్పందించారు. ఇంకా సందీప్ కిషన్, వెన్నెల కిషోర్, అనిల్ రావిపూడి, కోన వెంకట్ లు కూడా కేటీఆర్ ను అభినందించారు. వీరందరికీ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

KTR
bandla ganesh
sandeep kishan
jikhil
manchu vishnu
kona venkat
vennela kishor
anil ravipudi
  • Loading...

More Telugu News