Rahul Gandhi: గుజరాత్ లో కాంగ్రెస్ రాకున్నా రాహుల్ గ్రేట్... ఆయన శకం మొదలైనట్టే: ఉద్దవ్ థాక్రే ప్రశంసల వర్షం

  • కాంగ్రెస్ బాధ్యతను రాహుల్ ఒక్కరే మోశారు
  • రాజకీయాల్లో ఆయనిప్పుడు పరిపూర్ణుడు
  • తక్కువ అంచనా వేస్తే నష్టపోవడం ఖాయం

గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించడంలో రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ విఫలమైనప్పటికీ, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే మాత్రం ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన, గుజరాత్ ఫలితం ఎలా ఉన్నా, కాంగ్రెస్ బాధ్యతలను తన భుజస్కంధాలపై మోయడంలో రాహుల్ పరిపూర్ణత సాధించాడని, బీజేపీకి, నరేంద్ర మోదీకి ఎదురు నిలువగల ఏకైక నేత రాహుల్ మాత్రమేనని, ఆయన్ను ఎవరు తక్కువ అంచనా వేసినా నష్టపోవడం ఖాయమని అన్నారు.

మోదీ, అమిత్ షా వంటి దిగ్గజ నేతలు గుజరాత్ యుద్ధ భూమిలో ఉండగా, వారిని రాహుల్ ఎదుర్కొన్న తీరు అద్భుతమని, ఇక కేంద్రంలోని అధికార బీజేపీ రాహుల్ ను విమర్శించడం మానుకొని, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని చురకలు అంటించారు. ఇక దేశ రాజకీయాల్లో రాహుల్ శకం మొదలైనట్టేనని అభిప్రాయపడ్డారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News