pavan kalyan: 'అజ్ఞాతవాసి' తొలి వారంలో 100 కోట్లు రాబట్టనుందా?

  • దూసుకుపోతోన్న 'అజ్ఞాతవాసి' టీజర్ 
  • అమెరికాలోను అత్యధిక థియేటర్స్ లో రిలీజ్
  • త్రివిక్రమ్ - పవన్ కాంబినేషన్ కి గల క్రేజ్ ప్రధాన బలం     

పవన్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'అజ్ఞాతవాసి' సినిమాపైనే వుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, జనవరి 10వ తేదీన భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమా 100 కోట్లను కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. అదే మ్యాజిక్ 'అజ్ఞాతవాసి' తోను రిపీట్ కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లకి పైగానే జరిగే అవకాశం ఉందని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోను ఈ సినిమాను అత్యధిక థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. అందువలన తొలివారంలోనే ఈ సినిమా 100 కోట్లను రాబట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ కి గల క్రేజ్ .. ఈ సినిమా టీజర్ కి వస్తోన్న వ్యూస్ .. శాటిలైట్ రైట్స్ తెచ్చిన రేటు ఈ విషయాన్ని మరింత బలపరుస్తున్నాయని చెప్పుకోవచ్చు.    

  • Loading...

More Telugu News