Donald Trump: రష్యాలో ఐసిస్ భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నం.. ట్రంప్ కు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పిన పుతిన్
- సెయింట్ పీటర్స్ బర్గ్ ఉగ్రదాడికి కుట్ర
- పసిగట్టిన సీఐఏ
- వెంటనే రష్యాకు సమాచారం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో భారీ ఎత్తున విధ్వంసానికి పాల్పడేందుకు ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నారనే విషయాన్ని అమెరికా నిఘా సంస్థ సీఐఏ పసిగట్టింది. ఈ విషయాన్ని రష్యాకు తెలిపింది. సెయింట్ పీటర్స్ బర్గ్ లో ప్రఖ్యాతిగాంచిన ఖజాన్ క్యాథెడ్రెల్ పై బాంబులతో దాడి చేసి, పేల్చేయాలనుకుంటున్నారని, ఈ వారంలోనే ఈ దాడులు జరగబోతున్నాయని తెలిపింది.
ఈ నేపథ్యంలో, ఈ కుట్రకు పాల్పడిన ఏడుగురు ఐసిస్ ఉగ్రవాదులను రష్యా ఫెడరల్ సెక్యూరిటీ అదుపులోకి తీసుకుంది. దీంతో, భారీ విధ్వంసం జరగకుండా ఆగిపోయింది. వెంటనే ట్రంప్ కు ఫోన్ చేసిన పుతిన్ ఆయనకు, సీఐఏకు ధన్యవాదాలు తెలిపారు. ద్వైపాక్షిక బంధాలను మరింత మెరుగుపరుచుకుందామని ఇద్దరు నేతలు అభిలషించారు. గత వారం రోజుల్లో ట్రంప్, పుతిన్ లు మాట్లాడుకోవడం ఇది రెండో సారి.