Gujarath: ఎలక్షన్ కమిషన్ తొలి అధికారిక ప్రకటన... గుజరాత్ లో స్వల్ప ఆధిక్యంలో కాంగ్రెస్!

  • 61 చోట్ల పూర్తయిన తొలి రౌండ్ లెక్కింపు
  • 32 చోట్ల కాంగ్రెస్, 29 చోట్ల బీజేపీ
  • 7 నుంచి 11 రౌండ్లు సాగనున్న లెక్కింపు

గుజరాత్ ఎన్నికల కౌంటింగ్ పై ఎలక్షన్ కమిషన్ తొలి అధికారిక ప్రకటన జారీ చేసింది. 61 నియోజకవర్గాల్లో తొలి రౌండ్ ఔట్ల లెక్కింపు పూర్తయిందని, కాంగ్రెస్ 32 చోట్ల, బీజేపీ 29 చోట్ల ముందంజలో వున్నాయని పేర్కొంది. ఓట్ల లెక్కింపు వేగంగా సాగుతోందని, ప్రతి నియోజకవర్గంలో కనీసం 7 రౌండ్లను లెక్కించాల్సి వుందని, పెద్ద నియోజకవర్గాల్లో 11 రౌండ్ల వరకూ కౌంటింగ్ సాగుతుందని పేర్కొంది.

కాగా, గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోందన్న విషయం అర్థమవుతోంది. మరోవైపు కొద్దిసేపటి క్రితం వరకూ కోలాహలంగా ఉన్న బీజేపీ కార్యాలయాలు, ప్రస్తుతం కొంత నిశ్శబ్దంగా కనిపిస్తున్నాయి.

Gujarath
Congress
BJP
Election Commission
  • Loading...

More Telugu News