Jignesh: గుజరాత్ అప్ డేట్... ఓబీసీ నేతలు జిగ్నేశ్, అల్పేశ్ వెనుకంజ

  • బడుగు, బలహీన వర్గాల ప్రతినిధులు 
  • కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన నాయకులు
  • ఓటమి దిశగా తొలి అడుగు వేసిన జిగ్నేశ్, అల్పేశ్

గుజరాత్ లో బడుగు, బలహీన వర్గాల ప్రతినిధులుగా ఎంతో పేరు తెచ్చుకున్న నేతలు జిగ్నేశ్, అల్పేశ్ లు అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకంజలో ఉన్నారు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన సంగతి తెలిసిందే. గుజరాత్ నుంచి అందుతున్న సమాచారం  ప్రకారం, 182 స్థానాలున్న గుజరాత్ లో 91 స్థానాల ఫలితాల సరళి వెల్లడవుతుండగా, బీజేపీ 54 చోట్లు, కాంగ్రెస్ 37 చోట్ల ఆధిక్యంలో వున్నాయి.

జిగ్నేశ్, అల్పేశ్ లను ఇతర వెనుకబడిన వర్గాల ప్రతినిధులుగా దేశ రాజకీయ విశ్లేషకులు భావించిన నేపథ్యంలో ఓటమి దిశగా వారి తొలి అడుగు పడటం గమనార్హం. ఇక హిమాచల్ విషయానికి వస్తే, 16 చోట్ల ఫలితాల సరళి తెలుస్తుండగా, బీజేపీ 12 చోట్ల, కాంగ్రెస్ 4 చోట్ల ముందంజలో వున్నాయి.

Jignesh
Alpesh
Gujarath
Electons
  • Loading...

More Telugu News