PV Sindhu: ఇంత బాధ ఎన్నడూ కలగలేదంటూ కన్నీరు పెట్టుకున్న పీవీ సింధూ!

  • సూపర్ సిరీస్ ఫైనల్ లో పోరాడి ఓడిన సింధు
  • యమగూచితో పోరులో ఆఖరి మెట్టుపై బోల్తా
  • మ్యాచ్ తరువాత చాలా సేపు ఏడ్చాను
  • శాయశక్తులా ప్రయత్నించానన్న తెలుగుతేజం

నిన్న జరిగిన సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్ లో పోరాడి ఓడిన తెలుగుతేజం పీవీ సింధూ, మ్యాచ్ అనంతరం కన్నీరు పెట్టుకుంది. ఫైనల్ లో విజయం కోసం యమగూచితో తలపడిన ఆమె, శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ, విజయం సాధించడంలో విఫలమైంది. మ్యాచ్ అనంతరం ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆమె, ఓటమి కంటే, ఓడిన తీరు తనను బాధించిందని ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ పేర్కొంది. ఇంత భాధ తన జీవితంలో ఎన్నడూ కలుగలేదని, మ్యాచ్ తరువాత చాలాసేపు కోలుకోలేకపోయానని, బాధను దాచుకోలేక ఒంటరిగా వెళ్లి ఏడ్చానని తెలిపింది.

 తాను ఎలా విజయానికి చేరుకోలేకపోయానో తెలియడం లేదని, నిర్ణయాత్మక మూడో సెట్ లో 19-19 వద్ద ఉన్నప్పుడు కూడా ఓడిపోతానన్న బాధ తనకు రాలేదని, అనవసర తప్పులు కూడా చేయలేదని అంది. గెలుపుకోసం తాను ఏం చేయగలనో అంతా చేశానని, చివర్లో చేజార్చుకున్నానని సింధూ వ్యాఖ్యానించింది. గెలుపు, ఓటములు సహజమని, ఈ సంవత్సరం తాను ఎక్కువ మ్యాచ్ లు గెలిచినందుకు సంతోషంగా ఉందని చెప్పింది.

PV Sindhu
World Super Series
Badminton
  • Loading...

More Telugu News