kim jong un: కిమ్ జాంగ్ ఫొటోతో సీపీఐ పోస్టర్.. బీజేపీ ఫైర్!

  • కేరళలో సీపీఐ ముద్రించిన పోస్టర్
  • రాష్ట్రంలో ఆరెస్సెస్ కార్యకర్తల హత్యకు ఇదే కారణమన్న బీజేపీ
  • సీపీఐపై వ్యంగ్యాస్త్రాలు విసిరిన సంబిత్ పాత్రా

వరుస అణు ప్రయోగాలతో అలజడి సృష్టిస్తున్న ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్న ఫొటో సీపీఐ పార్టీ బ్యానర్ లో కనిపించడం సంచలనం రేకెత్తించింది. కేరళ రాష్ట్రంలోని ఓ ప్రదేశంలో ఈ బ్యానర్ కనిపించింది. దీనిపై బీజేపీ మండిపడింది. కేరళలో వరుసగా ఆరెస్సెస్ కార్యకర్తలు హత్యలకు గురికావడానికి ఇదే కారణమని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా అన్నారు.

భారత్ లోని బీజేపీ, ఆరెస్సెస్ కార్యాలయాలపై కిమ్ జాంగ్ తరహాలో సీపీఐ అణు క్షిపణులను వేయదని ఆశిస్తున్నట్టు ట్విట్టర్లో ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కేరళలో సీపీఐ హత్యాకాండను కొనసాగిస్తోందని మండిపడ్డారు. బీజేపీ, ఆరెస్సెస్ కార్యాలయాలను నేలమట్టం చేయడం సీపీఐ తర్వాతి ఎజెండా కాకూడదని ఆశిస్తున్నట్టు తెలిపారు. 

kim jong un
kim jong un in cpi poster
  • Loading...

More Telugu News