Sania Mirza: సానియా మీర్జాకు మోకాలి గాయం.. బెడ్ రెస్ట్!

  • ఆస్ట్రేలియన్ ఓపెన్ కు సానియా దూరం
  • మోకాలికి శస్త్ర చికిత్స
  • రెండు నెలలు రెస్ట్

మోకాలి గాయం కారణంగా జనవరిలో జరగబోయే ఆస్ట్రేలియన్ ఓపెన్ కు సానియా మీర్జా దూరమైంది. ఆమె మోకాలికి శస్త్ర చికిత్స నిర్వహించిన డాక్టర్లు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కోల్ కతా లోని ప్రేమ్ జిత్ లాల్ ఇన్విటేషన్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కోసం విచ్చేసిన సానియా ఈ విషయాన్ని వెల్లడించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 15 సంవత్సరాల తర్వాత కొన్ని నెలలు ఆటకు దూరం కావడం పెద్ద విషయమేమీ కాదని తెలిపింది. రోజర్ ఫెదరర్ కూడా ఆరు నెలల విశ్రాంతి తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అద్భుతాలు చేస్తున్నాడని గుర్తు చేసింది. తన విషయంలో కూడా అలాగే జరుగుతుందని భావిస్తున్నానని తెలిపింది. 

Sania Mirza
sania mirza injury
australian open
  • Loading...

More Telugu News