Chandrababu: చంద్రబాబును ఎప్పుడైనా విమర్శించుకోవచ్చు: పవన్ కల్యాణ్ కు టీడీపీ ఎమ్మెల్యే అనిత కౌంటర్

  • చంద్రబాబుపై పవన్ వ్యాఖ్యలను ఖండించిన అనిత
  • స్వేచ్ఛ ఉందంటూనే సమస్యలపై అవగాహన లేదని ఎద్దేవా
  • సమస్య ఉంటే వెంటనే పరిష్కరిస్తున్నామన్న అనిత

ఇటీవలి తన ఆంధ్రప్రదేశ్ పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యే, మహిళా నేత అనిత ఖండించారు. ప్రజల సమస్యలపై ఏ మాత్రం అవగాహన లేని పవన్ విమర్శలు గుప్పించడం ఏంటని అడిగారు. ముఖ్యమంత్రిని విమర్శించే స్వేచ్ఛ పవన్ కు ఉందని చెబుతూనే, 2019 ఎన్నికల తరువాత ఎవరు ప్రజా నాయకులవుతారన్న విషయాన్ని ప్రజలే తేలుస్తారని అన్నారు.

తన దృష్టికి వచ్చిన సమస్యలను పవన్ ప్రస్తావిస్తే, చంద్రబాబునాయుడు వెంటనే వాటిని పరిష్కరిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం విపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ సీపీ, తన బాధ్యతను పూర్తిగా మరిచిపోయిందని, త్వరలోనే ఆ పార్టీ కనుమరుగు కానుందని అనిత జోస్యం చెప్పారు. అనిత మాట్లాడిన వీడియోను మీరూ చూడవచ్చు.

Chandrababu
Pawan Kalyan
Anita
  • Error fetching data: Network response was not ok

More Telugu News