Sanjay kakade: ఎగ్జిట్ పోల్స్ తప్పు... గుజరాత్ లో గెలిచేది కాంగ్రెస్సే!: బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

  • రేపు గుజరాత్ ఎన్నికల ఫలితాలు
  • గెలిచేది కాంగ్రెస్ పార్టీయే
  • అన్ని వర్గాలూ కాంగ్రెస్ కు అనుకూలం
  • 75 శాతం ఓట్లు పడ్డాయన్న సంజయ్ కాకడే

గత వారంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగగా, గత ప్రభుత్వంతో పోలిస్తే, కొద్దిగా మెజారిటీ తగ్గినా, బీజేపీయే అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ కోడై కూస్తుండగా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ కాకడే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ఫలితాలు వాస్తవ దూరమని, తమ పార్టీ ఓడిపోనుందని ఆయన అన్నారు. తాను జరిపించిన సర్వేలో 75 శాతం మంది ఓటర్లు కాంగ్రెస్ కు అనుకూలంగా నిలిచినట్టు తేలిందని అన్నారు.

మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గుజరాత్ లో నెలకొన్న సమస్యలపై దృష్టిని సారించలేదని సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో తొలిసారిగా ఓబీసీలు, పటేళ్లు, ముస్లింలు, దళితలు కాంగ్రెస్ వైపు నిలిచారని, విజయం ఆ పార్టీదేనని అన్నారు. కాగా, రేపు గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న సంగతి తెలిసిందే. కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లను చేసినట్టు ఈసీ పేర్కొంది.

Sanjay kakade
Gujarath
Elections
Congress
BJP
  • Loading...

More Telugu News