security guard dies: 11వ అంత‌స్తు నుంచి దూకిన మ‌హిళ‌.. క్యాచ్ ప‌ట్టుకోవాల‌నుకున్న వ్య‌క్తి.. ఇద్ద‌రూ మృతి.. వీడియో విడుద‌ల‌

  • చైనాలోని షాంక్సి ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఘ‌ట‌న‌
  • కాపాడడానికి ప్ర‌య‌త్నించి ప్రాణాలు కోల్పోయిన సెక్యూరిటీ గార్డు
  • కుటుంబ క‌ల‌హాల వ‌ల్లే మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌

11వ అంత‌స్తు నుంచి దూకిన ఓ మ‌హిళ‌ను క్యాచ్ ప‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నించిన ఓ వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న చైనాలోని షాంక్సి ప్రాంతంలో చోటు చేసుకుంది. ‌పై నుంచి దూకిన మ‌హిళ కూడా మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది. ఓ అపార్ట్ మెంటులో లీ అనే 43 ఏళ్ల‌ వ్య‌క్తి ఐదేళ్లుగా సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేస్తున్నాడు. బాల్క‌నీలోకి వ‌చ్చి కింద‌కు దూకాల‌నుకుంటోన్న ఓ మ‌హిళ‌ను చూశాడు.

ఆమె ఒక్క‌సారిగా పై నుంచి దూకేయ‌డంతో ఆమెను కాపాడే ఉద్దేశంతో రెండు చేతులు పైకి చాచి ప‌ట్టుకోవాల‌నుకున్నాడు. చాలా బ‌రువు ఉన్న ఆమె అతి వేగంగా వ‌చ్చి ప‌డ‌డంతో సెక్యూరిటీ గార్డు చ‌నిపోయాడు. ఆ మ‌హిళ‌ కుటుంబ క‌ల‌హాల వ‌ల్లే ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News